Thalapathi Vijay : ఆ స్టార్ హీరో కొత్త ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా..?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathi Vijay) కొత్త ఇల్లు కొన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉంటున్న ఇల్లు బాగానే ఉన్నా ఇంకాస్త పెద్దగా ఉండాలని తన అభిరుచికి తగినట్టుగా ఉన్న ఇంటిని కొన్నారట. ఈ ఇంటి ధర తెలిసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. అక్షరాల 35 కోట్ల రూపాయలతో విజయ్ ఇల్లు కొన్నారని తెలుస్తుంది. ఆ ఇంటికి కావాల్సిన డిజైన్స్ అన్ని స్పెషల్ గా దగ్గర ఉండి మరి చూసుకుంటున్నారట.

తమిళంలో విజయ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ రజినికాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరోగా విజయ్ (Thalapathi Vijay) సూపర్ ఇమేజ్ సంపాదించాడు. అయితే విజయ్ ఓ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసిందే. ఈ కొత్త ఇంటిని అలా కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఆల్రెడీ పార్టీ పేరు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు.

తమిళనాడులో ఆల్రెడీ సినీ స్టార్స్ రాజకీయ ప్రస్థానం సాగించిన సందర్భం తెలిసిందే. ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో సొంత పార్టీ పెట్టి పొలిటికల్ గా కూడా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తున్నాడు.

Tags: Kollywood, Star Hero Vijay, Thalapathi Vijay, Thalapathi Vijay Updates, Tollywood, vijay