స్టార్ హీరో అయినా స్టార్ హీరోయిన్ అయినా వాళ్లు చేస్తున్న సినిమాలతో ఎప్పుడో ఒకసారి వారికి టైం కలిసి వస్తుంది. దానితో వారు అదరగొట్టేయడం కామన్. బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ సత్తా చాటిన మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అయితే అమ్మడు లేటెస్ట్ గా తెలుగులో సీతారామం సినిమా చేసింది. ఈ సినిమాలో సీతామాలక్ష్మి, నూర్జహాన్ పాత్రల్లో మృనాల్ తన టాలెంట్ చూపించింది.
సీతారామం హిట్ మృనాల్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ని బీభత్సంగా పెంచేసింది. సీతారామం సినిమాకు ముందు 4 మిలియన్స్ కి అటు ఇటుగా ఉన్న మృనాల్ ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ సీతారామం తర్వాత 5 మిలియన్ దాటేశారు. సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత జస్ట్ 20 రోజుల్లో మృనాల్ కి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చి చేరారు.
ఓ విధంగా ఓ హీరోయిన్ కి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఇంత తక్కువ టైం లో రావడం అంటే గొప్ప విషయమని చెప్పొచ్చు. సీతారామం తర్వాత మృనాల్ (Mrunal Thakur) కి తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. సీతారామం తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనే రిలీజైంది. సెప్టెంబర్ 2న ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.