జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు ఇవే !

2020లో విడుదలైన సినిమాలకు 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు కాసేపటి క్రితం ప్రకటించబడ్డాయి. ఈ సినిమాలు విడుదలైన టైములో కరోనా మహమ్మారి సమయం కాబట్టి, జ్యూరీకి చూడటానికి తక్కువ సినిమా ఎంట్రీలు వచ్చాయి. అన్ని అవార్డులలో, ముఖ్యంగా తెలుగులో అనేక సప్రైజ్ అవార్డ్స్ వచ్చాయి .

థియేట్రికల్ విడుదల కానీ చిన్న సినిమా “కలర్ ఫోటో” ఉత్తమ ప్రాంతీయ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ పై సాయి రాజేష్ నిర్మించారు.ఊహించిన విధంగానే, థమన్ ఎస్ అలా వైకుంఠపురములో చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడి విభాగంలో జాతీయ అవార్డును సాధించాడు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌కు గాను తమన్‌కు ఈ అవార్డు దక్కింది. అయితే సూర్య నటించిన సూరరై పొట్రు చిత్రానికి గానూ జివి ప్రకాష్ కుమార్ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డును అందుకున్నారు.

మరోవైపు మరో చిన్న చిత్రం నాట్యం రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అందులో ఒకటి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గాను టీవీ రామ్‌బాబుకు అవార్డు దక్కింది. మరోవైపు, ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించిన సంధ్యా రాజు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కైవసం చేసుకున్నారు.మొత్తమ్మీద చిన్న సినిమాలకు అవార్డులు ఇచ్చేలా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడంతో టాలెంట్ ఉన్న యువత ఇది మరింత ఉత్సాహాన్ని ఇచ్చేదే . .

అలా వైకుంఠపురములో మరెన్నో అవార్డులు వస్తాయని సినీ ప్రేమికులు అనుకున్నారు కానీ ఒక్క అవార్డుతో సినిమా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Tags: Ala Vaikuntapuralo national award, colour photo movie national award, national awards 2020, natyam movie national award, telugu news, tollywood news