Tamanna : డబ్బులు ఇస్తే చాలు తమన్నా ఎవరితోనైనా చేస్తుంది..!

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) దాదాపు రెండు దశాబ్ధాలుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికి కూడా ఆమె వరుస ఛాన్సులతో సత్తా చాటుతుంది. దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా సీనియర్ హీరోలతో కూడా జోడీ కడుతుంది. తనకు రెమ్యునరేషన్ ఇస్తే చాలు ఎవరితో అయినా నటిస్తానని చెప్పే తమన్నా లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినితో కలిసి నటించడానికి సిద్ధమైంది.

రజినికాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జైలర్. ఈ సినిమాలో తమన్నా (Tamanna) హీరోయిన్ గా నటిస్తుంది. రజిని పక్కన హీరోయిన్ గా నటించాలి అంటే హీరోయిన్స్ కొద్దిగా ఆలోచిస్తారు కానీ రెమ్యునరేషన్ కోసమే తమన్నా ఈ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన తమన్నా ఇక మీదట సీనియర్ హీరోలతో కూడా సై అనేస్తుంది.

రజిని సినిమాలో నటించేందుకు అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. హీరోయిన్ గానే కాదు ఐటం గాళ్ గా కూడా యువ హీరోల సినిమాల్లో చేస్తూ వస్తుంది తమన్నా.

Tags: Jailer, Rajinikanth, superstar rajinikanth, Tamanna, Tamannah Bhatia, Tollywood