Pushpa 2 : సుక్కు స్కెచ్.. దెబ్బకి 50 కోట్లు అతని ఖాతాలోకి వచ్చి పడేలా చేసింది..!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరక్టర్ గా మారిన సుకుమార్ ప్రాస్తుతం పుష్ప 2 (Pushpa 2) ని సెట్స్ మీదకు తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న పుష్ప 2 సెప్టెంబర్ నుంచ్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఇక పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ మరో అదనపు బాధ్యత కూడా మీద వేసుకున్నాడని తెలుస్తుంది. సుకుమార్ పుష్ప 2కి దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది.

పుష్ప పార్ట్ 1లో నిర్మాణ భాగస్వామ్యం ఉన్న ముత్తంశెట్టి వారు పార్ట్ 2కి తప్పుకోగా వారి ప్లేస్ లో సుకుమార్ రిప్లేస్ చేశాడట. దీనికోసం సుకుమార్ ఏమి డబ్బులు పెట్టాల్సిన పనిలేదు. జస్ట్ సుకుమార్ రెమ్యునరేషన్ లేకుండా పనిచేస్తాడు అంతే. ఇక రిలీజ్ టైం లో బిజినెస్ లో షేర్ తీసుకుంటాడు. మాములుగా అయితే 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే సుకుమార్ ఈ స్కెచ్ తో డబుల్ ట్రిపుల్ తన ఖాతాలో వచ్చేలా చేసుకున్నాడు.

అంటే Pushpa 2 కోసం సుకుమార్ దాదాపు 50 కోట్ల దాకా లాభ పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సుకుమార్ తో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 40 నుంచి 50 కోట్ల దాకా పార్ట్ 2కి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Tags: allu arjun, Iconstar Allu Arjun, Mytri Movie Makers, Pushpa 2, Sukku, sukumar