బాహుబలితో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ (Prabhas) తను చేస్తున్న ప్రతి సినిమా ఆ రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నాడు. సాహో, రాధే శ్యాం ఫలితాలు ఎలా ఉన్నా ప్రభాస్ ప్రతి సినిమా నేషనల్ లెవల్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రాజెక్ట్ కె కూడా సెట్స్ మీద ఉంది. వీటితో పాటుగా సందీప్ వంగ డైరక్షన్ లో స్పిరిట్ అనే సినిమా ఎనౌన్స్ చేశారు.
ఇక వీటితో పాటుగా యంగ్ రైటర్ వాసుదేవ్ కూడా ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ కథతో ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడట. రీసెంట్ గా బింబిసారకి కథ అందించిన వాసుదేవ్ ఆ సినిమా హిట్ తో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో వాసుదేవ్ భగత్ సింగ్ కథని ప్రభాస్ తో తెరకెక్కించాలనే కోరిక బయపెట్టాడు. ఎప్పటికైనా ప్రభాస్ తో భగత్ సింగ్ కథ తీస్తానని అంటున్నాడు వాసుదేవ్.
ప్రస్తుతం టాలీవుడ్ యువ రక్తంతో దూసుకెళ్తుంది. కొత్త కథలు.. కొత్త ఆలోచనలతో యువ దర్శకులు అదరగొడుతున్నారు. ప్రభాస్ (Prabhas) భగత్ సింగ్ ఈ ఆలోచనే అదిరిపోయింది. కచ్చితంగా ఈ సినిమా వస్తే మాత్రం మరో సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు.