సుధీర్ బాబు’పాన్ ఇండియా ‘ సినిమా టైటిల్ రిలీజ్

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ సుధీర్ బాబు హీరోగా నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ఈ రోజు రిలీజ్ చేశారు .సుధీర్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘హంట్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుధీర్ బాబు మరో కొత్త చిత్రానికి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది . ఈ సినిమా టైటిల్‌ను చిత్ర నిర్మాతలు ఈ రోజు ప్రకటించారు.

1989 నాటి కుప్పం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి ‘హరోమ్ హర:’ ది రివోల్ట్ అనే టైటిల్ పెట్టారు. చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి సంబందించిన ఇంటెన్స్ కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేశారు.ఈ చిత్రానికి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.

Tags: Chaitan Bharadwaj, Gnanasagar Dwaraka, Harom Hara Conceptual Title Video, Sudheer Babu, Sumanth