ప్రముఖ దర్శకుడు పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అదేమిటంటే నిన్న జరిగిన అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పరుశురాం త్వరలో ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని నందమూరిబాలకృష్ణకి వినిపిస్తానని పరశురామ్ ప్రకటించారు. బాలకృష్ణతో కలిసి పనిచేయాలనే కోరికను పరుశురాం ఈ వేదికపైనుండి వ్యక్తం చేశారు.
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు పరశురామ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఆశించినత హిట్ కాలేదు.ప్రస్తుతం పరుశురాం నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ను రూపొందించడంపై దృష్టి సారించాడు.టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కూడా సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.