మంచు మనోజ్ మీద కోపంతో ఆ స్టార్ హీరోయిన్ తాగి రోడ్డుపై అంతకు దిగజారిందా..!?

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉండే బడా ఫ్యామిలీలో ఎక్కడా లేని గొడవలు కేవలం మంచు కుటుంబంలోనే ఉన్నట్లు వారి ప్రవర్తన చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్ లో మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ పెళ్లి సమయంలో, అలాగే పెళ్లి తర్వాత జరిగిన గొడవ గురించి మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియో గురించి అలాగే మంచు మోహన్ బాబు రిజిస్టర్ ఆఫీస్ ముందు విలేకరులతో గొడవ పడిన విషయం ఇలా ఏ విషయం తీసుకున్నా సరే మంచు ఫ్యామిలీలో ఎన్నో గొడవలు ఉన్నయి అనే విషయం ప్రతి ఒక్కరికి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది.

ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మంచు కుటుంబం నుంచి మోహన్ బాబు తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు తన ఇద్దరు కొడుకుల్లో ఎవరూ తెచ్చుకోలేదు. ఇదే సమయంలో మంచు మనోజ్ మాత్రం కాస్త ఈ కుటుంబంలో మంచివాడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మనోజ్ గురించి ఓ హీరోయిన్ రోడ్డెక్కి తాగి నానా రచ్చ చేసిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు..? ఎందుకు అలా చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. మంచు మనోజ్ తన సినిమాలతో ఎందరో హీరోయిన్లను పరిచయం చేశారు. అలానే ఎందరో హీరోయిన్లతో మంచి స్నేహం సంబంధాలు కూడా ఉన్నాయి.

అలానే బాలయ్యతో సింహా సినిమాలో హీరోయిన్‌గా నటించిన స్నేహ ఉల్లాల్ కూడా మనోజ్ కు మంచి ఫ్రెండ్. అయితే గతంలో స్నేహ ఉల్లాల్, మనోజ్ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులందరినీ పిలిచి పెద్ద పార్టీ ఇస్తానని చెప్పిందట. అంతేకాకుండా ఇదే విషయాన్ని మనోజ్ కి కూడా చెప్పిందట. అయితే మంచు మనోజ్‌ తన కుటుంబంతో పుట్టినరోజును జరుపుకోవడంతో స్నేహ ఉల్లాల్ అరేంజ్ చేసిన పార్టీకి వెళ్లలేదట.

ఇక దాంతో కోపంతో రెచ్చిపోయిన స్నేహ ఉల్లాల్ బాగా తాగి రోడ్డుపై నానా రచ్చ చేసిందట. అంతేకాకుండా మద్యం మత్తులో ఏం చేస్తుందో తనకే తెలియలేదట. ఇక ఆమె చేసిన రచ్చ‌కీ పోలీసులు కూడా వచ్చి తీసుకువెళ్లారనే విషయం అప్పట్లో ఎంతో వైరల్ గా కూడా మారింది. ఇలా మంచు మనోజ్ తాను అరేంజ్ చేసిన బర్త్ డే పార్టీకి రాలేదనే కోపంతో స్నేహ ఉల్లాల్ చేసిన పని అప్పట్లో సెన్సేషన్‌గా
మారింది.