Prabhas : సలార్ లో విలన్ గా ఆ స్టార్ హీరో..!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాని కె.జి.ఎఫ్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే రిలీజ్ డేట్ పోస్టర్ తో వచ్చి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. ఇక ఈ సినిమాలో విలన్ గా కూడా మళయాళ స్టార్ హీరో పృధ్వి రాజ్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

మళయాళంలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న పృధ్వి రాజ్ యాక్టర్ కం డైరక్టర్ గా అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలో ఆయన నటిస్తున్నాడు. సలార్ లో ఆయన కూడా భాగం అవడం సినిమాపై మరింత అంచనాలు పెంచింది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సలార్ సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి.

సలార్ సినిమా ముందు ఒక పార్ట్ గా అనుకున్నా ఇప్పుడు రెండు పార్టులుగా వస్తుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) ప్రాజెక్ట్ కె కూడా రెడీ అవుతుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమా నిర్మిస్తున్నారు.

Tags: Prabhas, Prashanth Neel, Pridhvi Raj, Salaar, Tollywood