సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ SSMB28 త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాని ముందు తెలుగు వరకే రిలీజ్ అనుకున్నా ప్రస్తుతం తెలుగు హీరోలంతా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న తరుణంలో మహేష్ కూడా తన సినిమాని నేషనల్ లెవల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 28 వ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ ఆడియెన్స్ ని కూడా మెప్పించేలా కథలో కొన్ని మార్పులు చేశారట త్రివిక్రం. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ SSMB28 సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా 2023 ఏప్రిల్ 28న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పోకిరి సినిమా కూడా ఆ డేట్ నే రిలీజైంద్ది.
సర్కారు వారి పాట తో హిట్ మేనియా కొనసాగిస్తున్న మహేఏష్ రాబోతున్న త్రివిక్రం సినిమాతో కూడా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. మహేష్, త్రివిక్రం కాంబో అంటేనే ఆడియెన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి ఈసారి ఆ అంచనాలకు తగినట్టుగా హిట్ పడుతుందో లేదో చూడాలి.