యూఎస్ లో దుమ్మురేపుతున్న సీతారామం.. ఇప్పటి వరకొచ్చిన కలెక్షన్లు ఎంతంటే!

టాలీవుడ్ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ వంటి లవ్ స్టోరీస్ తో హను మెప్పించాడు. ఈసారి హను సీతా రామం అనే పేరుతో యుద్ధ నేపథ్యం ఉన్న ప్రేమ కథతో తెర ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ హను రాఘవపూడి కెరీర్లోనే తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్, హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమైన పాత్రలో సుమంత్, రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్ నటించారు. సీతారామం సినిమా తెలుగు, తమిళం,మలయాళం భాషలతో పాటు హిందీ లోనూ సత్తా చాటుతోంది. వీక్ డేస్ లోనూ మంచి వసూళ్లు అందుకుంటోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి.

యూఎస్ లో ఈ సినిమా ఇప్పటివరకు 8 లక్షల 50 వేల డాలర్స్ వసూళ్లు సాధించింది. అతి త్వరలోనే ఈ సినిమా అక్కడ వన్ మిలియన్ క్లబ్ లో చేరనుంది. ఇవాళ రక్షాబంధన్, వీకెండ్, సండే, ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే హాలిడే లు కూడా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరింత కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ తాను హీరోగా నటించిన తొలి తెలుగు సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. కాగా సీతారామం సినిమాను స్వప్న సినిమాస్ పతాకంపై స్వప్న, అశ్వనీదత్ నిర్మించారు.

Tags: Dulquer Salmaan, Mrunal Thakur, sita ramam movie, sita ramam movie collections