బాల‌య్య సీన్‌ను అడ్డంగా కాపీ కొట్టేసిన షారుక్‌.. ‘ జ‌వాన్ ‘ ట్రైల‌ర్‌తో బుక్ అయ్యాడుగా ( వీడియో)

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 108వ సినిమా భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సాధించింది. ఈ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైనర్ గా కట్ చేశాడు అనిల్ రావిపూడి.

టీజర్ లాస్ట్ లో ట్రైన్లోలో సాంగ్ పాడుతూ బాలయ్య విజిల్ వేసి గిటార్ ప్లే చేస్తున్నట్టు బ్యాట్ తో ఇచ్చిన స్టిల్ మనం ఈ టీజర్ లో చూడవచ్చు. ప్రస్తుతం ఇదే సీన్ బాలీవుడ్ భాద్‌షా షారుఖ్ ఖాన్ తన జవాన్ సినిమా టీజర్ లో కాపీ కొట్టాడ‌న్న‌ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని ప్రూఫ్స్ కూడా బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా టీజర్ లో కూడా సేమ్ టు సేమ్ డిట్టో భగవంత్ కేసరి లాగానే షారుక్ ఖాన్ ఏఎన్ఆర్ డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఈ మౌనం ఈ బిడియం అనే సాంగ్ ప్లే చేస్తూ ఆ సాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు. భగవంత్ కేసరి సినిమా టీజర్ చివర్లో బాలయ్య విజిల్ వేస్తూ స్మైల్ ఇవ్వడం.. తర్వాత ఫుల్ జోష్లో గిటార్ ప్లే చేస్తూ స్టెప్స్ వేయడం చూస్తాం. ఇప్పుడు షారుఖ్ ఖాన్ అలాగే చేయడంతో ప్రస్తుతం ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

బాలీవుడ్ బాద్ షా, కింగ్ కాంగ్ కూడా బాలయ్య సినిమాని అడ్డంగా కాపీ కొట్టేసి ఇలా దొరికిపోయావా ? అంటూ బాల‌య్య ఫ్యాన్స్‌, టాలీవుడ్ సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అట్లీ.. అనిల్ ఐడియాను కాపీ చేశాడు అంటు బ్యాక్ టు బ్యాక్ ట్రోల్స్ తో ఆడేసుకుంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.