నాని 30 టైటిల్ వ‌చ్చేసింది…. ఆ స్టార్ హీరో టైటిల్ కొట్టేశాడే…!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని మరియు గార్జియస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబినేష‌న్లో నాని 30వ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌టిస్తామంటూ మేక‌ర్స్ కొద్ది రోజులుగా చెపుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఈ సినిమా టైటిల్‌ ప్రకటించేందుకు ప్రధాన నటీనటులు అంద‌రూ ఉన్న టైటిల్ పోస్టర్ నేడు తాజాగా విడుదల చేశారు.

సింపుల్‌గా, క్యాచీగా సాగే ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేక‌ర్స్‌. తాజాగా రిలీజ్ చేసిన వీడియో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఎమోషనల్ రైడ్‌గా ఉంటుందని వీడియో ను చూస్తేనే క్లారిటీ అయితే వ‌చ్చేసింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ గ్లింప్స్ టైటిల్ వీడియోను వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హాయ్ నాన్న సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక గ‌తంలో త‌మిళ హీరో విక్ర‌మ్ న‌టించిన నాన్న సినిమా తెలుగులో వ‌చ్చింది. అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు ఏఎల్‌. విజ‌య్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కూడా చిన్న పాప సెంటిమెంట్తో తెర‌కెక్కింది. ఇప్పుడు నాని హాయ్ నాన్న సినిమా కూడా దాదాపు అదే ఫార్మాట్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

టైటిల్‌తో పాటు చిన్న పాప కూడా విక్ర‌మ్ నాన్నలాగానే ఉన్నాయి. ఇక ద‌స‌రా లాంటి పాన్ ఇండియా త‌ర్వాత నాని మ‌రో పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా 5 భాషల్లో డిసెంబర్ 21, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కానుంది.