ఎస్సై, కానిస్టేబుల్ చెంప చెల్లుమ‌నిపించిన వైఎస్‌. ష‌ర్మిల‌… ద‌రుసుగా ఏం చేసిందో చూడండి ( వీడియో)

వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్‌. ష‌ర్మిల‌ను ఈ రోజు తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. లోట‌స్ పాండ్ నుంచి ఆమె బ‌య‌ట‌కు వ‌స్తోన్న క్ర‌మంలోనే అరెస్టు చేశారు. సొంత ప‌నుల‌కు కూడా బ‌య‌ట‌కు రాకుండా అడ్డ‌కుంటారా ? అస‌లు న‌న్ను అరెస్టు చేసేందుకు మీకు ఏ అధికారం ఉంద‌ని ఆమె పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగారు. ఆమెను ఇంట్లో నుంచి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్ర‌య‌త్నం చేశారు.

అయితే ఆమె వారిని తోసేసుకుని మ‌రి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆమె అక్క‌డే రోడ్డు మీద బైఠాయించారు. ష‌ర్మిల అరెస్టు నేప‌థ్యంలో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. పోలీసులు ఆమెను అడ్డుకునే ప్ర‌య‌త్నంలో ష‌ర్మిల ఓ మ‌హిళా కానిస్టేబుల్ చెంప‌మీద కొట్టిన వీడియో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగే ఓ మ‌గ పోలీస్ అధికారిపై కూడా ఆమె చేసుకోగా.. అత‌డు న‌న్ను ఎందుకు కొడుతున్నారు ? న‌న్ను కొట్టేందుకు నువ్వు ఎవ‌రు ? అని ప్ర‌శ్నిస్తుండ‌గా… ష‌ర్మిల నువ్వు న‌న్ను ఎందుకు కొట్టావ్ అని తిరిగి ప్ర‌శ్నిస్తున్నారు.

చివ‌ర‌కు మ‌హిళా పోలీసులు ఆమెను బ‌ల‌వంతంగా అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఆమె ఇత‌ర పార్టీల నాయ‌కుల‌తో క‌లిసి పోరాటం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె దీక్ష‌కు పూనుకున్నారు. పోలీసులు ఆమెకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే ష‌ర్మిల హైకోర్టును ఆశ్ర‌యించ‌గా… కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చింది.

అయినా పోలీసులు ఆమెను దీక్ష‌కు వెళ్ల‌నియ‌కుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె వారి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించి వారికి చుక్కులు చూపించ‌డంతో పాటు చేయి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. పోలీసులు ఆమెపై ఐపీఎస్ 353, 330 సెక్ష‌న్ల ప్ర‌కారం కేసులు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఆమె స్టేష‌న్‌లో ఉండ‌గా.. విజ‌య‌మ్మ అక్క‌డ‌కు చేరుకున్నారు.