బిగ్ బ్రేకింగ్‌: అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ‌.. మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు వ‌చ్చిందిగా..

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో అదిరిపోయే షాక్ తగిలింది. అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సునీత తరఫున వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టేసింది. అవినాష్ ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేసింది.

తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని ప్రధాన ధర్మాసనం స్పష్టం చేసింది. సిబిఐకి హైకోర్టు అలాంటి నిబంధనలు విధించడం సరికాదని కూడా తన తీర్పులో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల వల్ల సిబిఐ దర్యాప్తు పైనా ఆ ప్రభావం పడుతుందన్న సుప్రీం… జూన్ నెలాఖరు వరకు సిపిఐ దర్యాప్తు గ‌డువును పొడిగించింది.

ఇక ఈనెల 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయవద్దు అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఈ పిటిషన్ పై తొలిసారిగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా తప్పు పట్టింది. తాజాగా ఈరోజు సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో మరోసారి విచారణ చేపట్టింది.

ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దని అవినాష్ న్యాయవాదులు ధర్మసనాన్ని కోరారు. మంగళవారం హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటివరకు అరెస్టు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో అవినాష్ రెడ్డికి అదిరిపోయే షాక్ తగిలింది.