బికినీ అందాల‌తో రెచ్చ‌గొడుతోన్న‌ రామ్‌చ‌ర‌ణ్ పొగ‌రు బోతు ప్రియురాలు…!

నేహా శర్మ తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరనే చెప్పాలి. నేహాశ‌ర్మ ఆయా ఇండస్ట్రీలో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ఈ అమ్మడు త‌న‌ గ్లామర్ షోతో, నటనతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. తన మొద‌టి సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’తో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. 2006లో ఈ సినిమా వ‌చ్చింది.

Chirutha - Wikipedia

ఈ సినిమాలో ఆమె రామ్‌చ‌ర‌ణ్‌ను రెచ్చ‌గొట్టే పొగ‌రుబోతు ప్రియురాలు పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు ముఖ్యంగా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నేహా శర్మ గ్లామర్, నటనకు ఆడియెన్స్ మంత్రముగ్ధులవడంతో ఈ హీరోయిన్ క్రేజ్ అమాంత పెరిగింది. కానీ ఆ తర్వాత తెలుగులో నేహా శర్మకు ఆఫర్లు తగ్గాయి. తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం తన కేరీర్ ముందుకు తీసుకెళుతోంది.

సినిమాల విషయాన్ని అటుంచితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది. అసలే సమ్మర్ హీట్… మ‌రోవైపు నేహా శర్మ త‌న‌ గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా తాను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

పోస్ట్ చేసిన పిక్స్ లో నేహా శర్మ గోవా బీచ్ లో ఇసుకతెన్నెల పైన టూ పీస్ బికినీలో హాట్ హాట్‌గా కనిపిస్తోంది. మతిపోయే పోజుల‌తో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోందీ ఈ బ్యూటీ. మరోవైపు ఈ హాట్ ఫొటోలతో పాటు.. క్యూట్ పిక్స్ కూడా పంచుకుంటూ తన అభిమానులు ఖుషీ చేస్తోంది.