ఇలియానాకు సినిమా ఛాన్సులు ఇవ్వ‌క‌పోవ‌డానికి ఆ ప్రెగ్నెన్సీయే కార‌ణ‌మా…!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హాట్ బ్యూటీస్ ఉన్నా గోవా ముద్దుగుమ్మ ఇలియానాకు ఉన్న నడుమ అందాల ముందు ఏ హీరోయిన్ సరిపోదనే చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఇలియానాకి ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. తమిళ్ ఇండస్ట్రీలో అయితే ఇలియానా సినిమా ఛాన్స్ లే రావడం లేదు. ఇటీవల కాలంలో ఇలియానా ప్రెగ్నెన్సీ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ న్యూస్ విన్న చాలామంది ఆమెపై ఫైర్ అవుతున్నారు.

పెళ్లి కాకముందే తల్లి అవడం ఏంటని ? అసలు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా అంటూ చాలామంది నెటిజ‌న్స్ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే ఇలియానాకు ఇప్పుడు మైనస్ కానుంది అంటున్నారు చాలామంది సినీ విశ్లేషకులు. తమిళ్ ఇండస్ట్రీలో మామూలుగానే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉంటారు. ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి బయటపడిన తరువాత ఇలియానాకి ఛాన్ప్ లు ఇవ్వకూడదని తమిళ్ ఇండస్ట్రీ నిర్ణయించుకుందట.

దీంతో పాటు మరో కారణం కూడా ఉంది. ఇలియానా తెలుగులో మాస్ మహారాజు రవితేజ తో నటించిన దేవుడు చేసిన మనుషులు మూవి షూటింగ్ టైంలో తమిళంలో మరో సినిమా చేయడానికి సైన్ చేసి ప్రొడ్యూసర్ దగ్గర భారీ అడ్వాన్స్‌ కూడా తీసుకుందట. కాని ఏవో కారణాలతో ఆ సినిమాలో నటించలేదు. ఆ ప్రొడ్యూసర్ అడగగా నేను ఈ సినిమా చేయను డబ్బు కూడా ఇవ్వను.. వేరే సినిమా చేస్తానులే అని సమాధానమిచ్చిందట. దాంతో ఆ నిర్మాత ఇలియానాపై కోలీవుడ్, నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా కేస్ ఫైల్ చేశాడు.

Ileana pregnancy: పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతున్న నటి ఇలియానా!!

దీంతో సౌత్ సినిమా ఇండస్ట్రీ ఇలియానా ను 10 సంవత్సరాలు పాటు బ్యాన్ చేసిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ విన్న చాలామంది ఆమె పై ఫైర్ అవుతున్నారు. ఇలియానాకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిన విషయమే.
ఇలియానా చేసిన కామెంట్స్ వల్ల గతంలో ఆమెకు అవకాశాలు తగ్గాయని వార్తలు కూడా వినిపించాయి. ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ నాకు బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని ఉందని అదే నా కోరిక అంటూ… సౌత్ సినిమాను త‌క్కువ చేసి మాట్లాడింది.

Ileana D'Cruz Is Pregnant; Actress Is Expecting Her 1st Baby; Netizens Ask  'Who Is the Father?'

దాంతో టాలీవుడ్ లో చాలామంది ప్రముఖులు ఇలియానాను పట్టించుకోవడం మానేశారు. తర్వాత ఇలియానా బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలో సక్సెస్ కావడంతో ఆమెకు బాలీవుడ్ లో ఛాన్సులు రాలేదు. టాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేయడంతో మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలో ఉందట ఇలియానా.