సమంత జీవితం చూసి కూడా అదితిరావుకి బుద్ధి రాలేదా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది సమంత. మొదటి సినిమాతోనే మంచి స్టార్ శం తెచ్చుకున్న సమంత మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతోనే ప్రేమ, పెళ్లి, విడాకులు జరిగిపోయాయి. ఇది సినిమా ఇండస్ట్రీలో కామన్ అని మాట్లాడుకున్నారు.

కానీ, హ్యూమన్ నేచర్ ఇలా కాదు ఉండేది. అని లోలోపల అటు సమంత, ఇటు నాగ చైతన్య బాధపడ్డారు. సమంత నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎంత మదనపడిందో అందరికీ తెల్సిందే. ఇంకొకరైతే మళ్ళీ బయట కనిపించేవారు కాదు. కానీ, సమంత హృదయం చాలా గట్టిది. వాస్తవంగా చెప్పాలంటే నాగ చైతన్యకంటే ముందే హీరో సిద్ధార్థతో ప్రేమలో పడింది.

ఇద్దరూ చాలా డీప్ లవ్ లో మునిగితేలారు. కానీ, ఎందుకో ఇద్దరూ విడిపోయారు. అప్పుడూ సమంత మానసికంగా చాలా కృంగిపోయింది. తర్వాత చైతూతో వ్యవహారం. సిద్ధార్థతో జరిగిన సంఘటన వల్ల అందరూ సిద్ధార్థనే తిట్టుకున్నారు. మధ్యలో చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపాడనే రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు అదితిరావు హైదరీని బాగా వాడుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇద్దరూ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. అప్పటి నుంచే సిద్దూ మాయలో అదితి పడిందని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే సమంతని మోసం చేసినట్టే సిద్ధార్థ్ అదితిరావు హైదరీని ముంచేస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి అదితి ఎందుకు సిద్దూ లవ్ లో పడిందో తెలీదు. సెలబ్రిటీలు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం బాగానే ఉంటుంది. విడిపోయాకే అంతా దరిద్రం పట్టుకుంటుంది.