ఒక్కరోజులో ‘సరిలేరునీకెవ్వరూ’ ఎన్ని కోట్లు కొల్లగొట్టేడో తెలుసా !

భారీ అంచనాలతో శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం గత రికార్డులను తిరగరాస్తున్నది. కొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. భారీ ఓపెనింగ్స్‌కు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా ఒక్క రోజులోనే అదీ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.30కోట్లను కొల్లగొట్టింది. ప్రిన్స్‌ మహేష్‌బాబు సత్తాను మరోసారి చాటింది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో, మహేశ్‌బాబు, రష్మికమందన్న, విజయశాంతి, ప్రకాష్‌రావు, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ తదితర తారాగణం నటించిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతున్నది. అధికారికంగా ఇంకా వెల్లడి కానప్పటికీ సుమారు ఒక్క రోజులోనే 30 కోట్లను కొల్లగొట్టి ఉండవచ్చని సమాచారం. మహేష్‌బాబుకు పట్టున్న నైజాం ఏరియాలోనే సుమారు రూ. 5 నుంచి 6 కోట్లను రాబట్టిందని తెలుస్తున్నది.

ఇక యూఎస్‌ విషయానికి వస్తే ప్రీమియర్స్‌ ద్వారా శుక్రవారం అమెరికాలో 7,63,269 డాలర్లను అంటే భారతీయ కరెన్సీలో రూ. 5.41కోట్లను రాబట్టింది. అపై శనివారం ఉదయానికల్లా మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లోకి చేరి మహేష్‌బాబు నటించిన గత మహర్షి సినిమా రికార్డును బద్దలు కొట్టింది. అదేవిధంగా లాంగ్‌రన్‌లో ఈ చిత్రం 3 మిలియన్‌ డాలర్‌క్లబ్‌లో చేరుతుందని ప్రిన్స్‌ అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తొలి రోజు కలెక్షన్లలో నాన్‌ బాహుబలి రికార్డును సరిలేరు నీకెవ్వరూ తిరిగరాసిందని తెలుస్తున్నది. అదీగాక ఈ సినిమా ఒక్క నెల్లూరు పట్టణంలోనే సుమారు 82 స్క్రీన్లలో ప్రదర్శితమైన మరో రికార్డును సృష్టించింది.

Tags: Anil Ravipudi, fisrt day collections, MaheshBabu, Sarileru Neekevvaru, Tollywood