అక్కడకి వెళ్తున్న సమంత.. స్టార్ హీరోతో రొమాన్స్..!

Samantha Debut in Malayalam Romance with Star Hero Dulquer Salman

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇన్నేళ్ల కెరియర్ లో తెలుగుతో పాటుగా తమిళ హిందీ సినిమాల్లో నటించినా ఇప్పుడు కొత్తగా మరో భాషలో ఎంట్రీ ఇస్తుంది. అదే మళయాళం. అవును సమంత తన కెరియర్ లో ఫస్ట్ టైం ఓ మళయాళ సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. అది కూడా అక్కడ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సమంత చేస్తున్న ఈ సినిమాపై అక్కడ సూపర్ బజ్ ఏర్పడింది.

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అభిలాష్ జోషి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత గ్లామర్ రోల్ లో కనిపించనుందట. సీతారామం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడు దుల్కర్ సల్మాన్. అంతకుముందు మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రలో మెప్పించిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు సీతారామం సినిమాలో రామ పాత్రలో అదరగొట్టాడు. తెలుగు ఆడియెన్స్ తన మీద చూపిస్తున్న ఈ ప్రేమకి ఇక్కడ వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకే మళయాళంలో తను చేస్తున్న ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎలాగు సమంత ఉంది కాబట్టి తెలుగులో సినిమాకు సూపర్ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓ పక్క బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లు చేస్తూ తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది సమంత.

Tags: Dulquer Salman, mahanati, Malayalam, Sam, Samantha, Seetha Ramam, Star hero, Tollywood