రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన భామ షాలిని పాండే (Shalini Pandey) ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదని చెప్పాలి. మొదట్లో తన లుక్స్ వల్ల అవకాశాలు రావట్లేదు అనుకుని జీరో సైజ్ గా మారింది అమ్మడు. గ్లామర్ విషయంలో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల సరైన ఛాన్సులు రావట్లేదు.
అర్జున్ రెడ్డి వల్ల తనకు వచ్చిన ఫాలోయింగ్ ని కాపాడుకోవడంలో తలమునకలవుతుంది షాలిని పాండే. ఈ క్రమంలో సినిమాలతో సంబంధం లేకుండా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని షాలిని (Shalini Pandey) లేటెస్ట్ గా పూల్ లో బికిని ట్రీట్ ఇస్తుంది. అంతకుముందే బీచ్ దగ్గర తన అందాలతో అలరించిన అమ్మడు తన లేటెస్ట్ ఫోటో పూల్ లో ఎంజాయ్ చేస్తుంది పెట్టింది.
బాలీవుడ్ లో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాతో తన ఫేట్ మారుతుంది అనుకున్న షాలిని పాండే ఆ సినిమా నిరాశపరచడంతో అక్కడ కూడా పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. ప్రస్తుతం హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న షాలిని పాండే తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. మరి అమ్మడికి అలాంటి లక్కీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.