ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్‌కు సీక్వెల్‌గా ‘ స‌లార్‌ ‘ … క్రూరుడైన గ్యాంగ‌స్ట‌ర్ రోల్లో ప్ర‌భాస్‌… ఒక్కొక్క హీరోకు ఉ… ప‌డిపోతోంది..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఇప్పుడు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చేసింది. వ‌రుస‌గా బాహుబ‌లి సీరిస్ సినిమాలు ఆ త‌ర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌తో పాటు త్వ‌ర‌లో రిలీజ్‌కు రెడీగా ఉన్న స‌లార్‌, ప్రాజెక్ట్ కే అస‌లు ఈ ప్రాజెక్టుల లైన‌ప్ చూస్తుంటేనే ఫ్యీజులు ఎగిరిపోయేలా ఉంది. ఆదిపురుష్‌పై ముందు నుంచి పెద్ద అంచనాలు లేవు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా అదే నిజ‌మైంది. ఇక ఇప్పుడు అంద‌రి అంచ‌నాలు సెప్టెంబ‌ర్ 28న వ‌స్తోన్న స‌లార్ మీదే ఉన్నాయి.

Salaar | 31 Interesting Facts | Prabhas | Shruti Haasan | Prashanth Neel | Hombale Films | Upcoming - YouTube

స‌లార్‌పై క‌నీవినీ ఎరుగ‌ని అంచ‌నాలు ఉండేందుకు కార‌ణం కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా టాప్ లేపిన ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌డ‌మే. పైగా స‌లార్ రెండు పార్టులుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు స‌లార్ సినిమా ప్ర‌శాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రంకు కంటిన్యూగా వ‌స్తోంద‌న్న టాక్ క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

క్రిటిక్స్ నుంచి భారీ ప్ర‌శంస‌లు రావ‌డంతో పాటు క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో ఉగ్రం ఓ సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ఉగ్రంకు బెట‌ర్‌గా ఈ స‌లార్ ఉండ‌బోతోంద‌ట‌. స‌లార్ లో ప్ర‌భాస్ అస్స‌లు క‌నిక‌రం అన్న‌దే లేని ఓ ప‌వ‌ర్ ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఉగ్రంలో హీరో పాత్ర‌కు సింబాలిక్‌గా ఉండ‌బోతోంద‌ని అంటున్నారు. ప్ర‌భాస్‌కు ఉన్న పాన్ వ‌ర‌ల్డ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా ఈ పాత్ర‌ను ప్ర‌శాంత్ నీల్ డిజైన్ చేశాడ‌ని… లార్జ‌ర్ దెన్ లైఫ్ పాత్ర‌లో భారీ యాక్ష‌న్ సీన్‌తో ప్ర‌భాస్ క‌ట్టిప‌డేస్తాడ‌ట‌.

Dil Raju confirms Prabhas and Prashanth Neel will team up again after Salaar | Entertainment News,The Indian Express

అస‌లు ఈ క‌థ‌తో పాటు ప్ర‌భాస్ పాత్ర వింటుంటేనే మ‌న స్టార్ హీరోలు కూడా స‌లార్ క్రియేట్ చేసే రికార్డులు చూసి ఉ… పోసుకునేలా ఉండ‌బోతోంద‌న్నంత హైప్ క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఉంది. త‌న బెస్ట్ ఫ్రెండ్ కు ఇచ్చిన హామీ మేర‌కు మాఫియా ముఠాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన ఓ వ్య‌క్తిని ఎలా మ‌ట్టుబెట్టాడు ? అన్న క‌థాంశంతోనే ఈ సినిమా ఉంటుంద‌ట‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ గా కనిపిస్తాడు. అలాగే జ‌గ‌ప‌తిబాబు కీ రోల్ ప్లే చేస్తుండ‌గా, శృతీహాస‌న్ హీరోయిన్గా న‌టిస్తోంది.