Pushpa 2 : పుష్ప 2 లో ఆ స్టార్ హీరోయిన్.. అంతా ఉత్తుత్తే..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సినిమా పుష్ప. పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కాగా ఈ సినిమా పాట్ 2 కోసం ఆడియన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పుష్ప 2 లో సాయి పల్లవి ఓ ట్రైబల్ ఉమెన్ గా కనిపించనుందని చెప్పారు. గత వారం రోజులుగా పుష్ప 2లో సాయి పల్లవి ఉందని హడావిడి చేశారు. అయితే పుష్ప టీం దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Pushpa 2 లో ఓ హీరోయిన్ నటిస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. అయితే ఇది ఓ రకంగా సాయి పల్లవి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. పుష్ప సినిమాలో ఆల్రెడీ రష్మిక మందన్న ఒక హీరోయిన్ గా నటిస్తుంది. పార్ట్ 1 లో పుష్ప రాజ్, శ్రీవల్లి రొమాన్స్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు పుష్ప 2 లో కూడా రష్మికతో సీన్స్ బాగుంటాయని తెలుస్తుంది.

Pushpa 2 సినిమాని త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు సుకుమార్. 2023 సెకండ్ హాఫ్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 ని మరింత గ్రాండియర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్క సెకండ్ పార్ట్ కోసమే 200 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారని టాక్.

Tags: allu arjun, Pushpa, Pushpa 2, Rashmika Mandanna, Sai Pallavi, sukumar