ర‌వితేజ ‘ రావ‌ణాసుర ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌…

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇప్ప‌టికే ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య సినిమాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ర‌వితేజ నుంచి రావ‌ణాసుర సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఏకంగా ఐదుగురు హీరోయిన్ల‌తో క్రైం జోన‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిషేక్ నామా, ర‌వితేజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అలాగే అక్కినేని హీరో సుశాంత్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.

ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ అయ్యాయి. మ‌రి సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో.. ట్విట్ట‌ర్‌లో ఎలాంటి రివ్యూలు వ‌స్తున్నాయో చూద్దాం. ఇక సినిమా ఫ‌స్టాఫ్ విష‌యానికి వ‌స్తే ప‌ర్లేదు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌ను మ‌నం ఓ డిఫ‌రెంట్ రోల్లో చూస్తాం. ఈ రోల్లో మ‌నం కాస్త షాకింగ్‌కు కూడా గుర‌వుతాం.

ఇక సినిమాలో ట్విస్టులు కూడా చాలా చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా టోన్‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటుంది. ఇక రావాణాసుర ఫుల్ మ‌సాలా థ్రిల్ల‌ర్ మూవీ అని.. ఫ్యాన్స్‌తో పాటు సాధార‌ణ ఆడియెన్స్‌ను కూడా అల‌రిస్తుంద‌ని కొంద‌రు చెపుతున్నారు. స్టోరీ, ఇంట‌ర్వెల్‌, బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్‌, క్లైమాక్స్‌, బీజీఎం అదిరిపోయింద‌ని కొంద‌రు చెపుతున్నారు.

ఇక లాయ‌ర్ క్రిమిన‌ల్ అయితే సినిమా ఎలా ఉంటుందో ? అదే స్టైల్లో బాగుంద‌ని.. సెకండాఫ్‌లో ట్విస్టులు అదిరిపోయాయ‌నే మ‌రి కొంద‌రు చెపుతున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం నిప్పు, ఖిలాడీ లాంటి చెత్త సినిమానే మ‌రోసారి తీశావ్ క‌దా అని ఫైర్ అవుతున్నారు. ఓవ‌రాల్‌గా ఓవ‌ర్సీస్ ఆడియెన్స్‌లో ఎక్కువ మంది సినిమా బాగుంద‌నే అంటున్నారు. మ‌రి పూర్తి రివ్యూ వ‌స్తేనే కానీ అస‌లు టాక్ ఎలా ఉందో తేలిపోనుంది.