Rashmika : రష్మిక కొత్త కండీషన్.. నిర్మాతలకు షాక్..!

కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika) తెలుగులో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. నేషనల్ క్రష్ గా మారిన రష్మిక అక్కడ ఇక్కడ అదరగొట్టేస్తుంది. ఇక ఈమధ్య అమ్మడు రెమ్యునరేషన్ కూడా మూడున్నర నుంచి నాలుగు కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్న టైం లోనే 70 % రెమ్యునరేషన్ ఇవ్వాలని అంటుందట.

సినిమా కమిట్ అయినప్పుడు ఒకలా తర్వాత మరోలా పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే రష్మిక (Rashmika) ముందు జాగ్రత్తగా సినిమాకు సైన్ చేసినప్పుడే 70 శాతం రెమ్యునరేషన్ అడుగుతుందట. దానికి ఓకే అంటేనే తనతో సినిమా చేయడానికి రండి అని చెబుతుందట. రష్మిక మరీ అంత డబ్బు మనిషా అని అనుకోవచ్చు. ఇచ్చిన కమిట్మెంట్ ఆధారంగానే రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రష్మిక పెట్టిన కొత్త కండీషన్ నిర్మాతలకు షాక్ ఇస్తుంది.

అసలైతే సినిమా చేసేప్పుడు ముందు కొంత అడ్వాన్స్ తర్వాత మధ్యలో కొంత ఇస్తారు. కానీ రష్మిక మాత్రం సైన్ చేసినప్పుడే 70 శాతం రెమ్యునరేషన్ ఇచ్చేయాలని చెబుతుంది.

Tags: Producers, Rashmika, Rashmika Condition, Rashmika Mandanna, Rashmika Remuneration, Rashmika Updates