తమిళ స్టార్ హీరో విశాల్ ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేస్తుంటాడు. ఆయన కెరీర్ మాత్రం మాస్, యాక్షన్ చిత్రాలే కనిపిస్తుంటాయి. హీరోలు మామూలుగా యాక్షన్ సన్నివేశాల్లో తమకు బదులుగా డూప్ లను వాడుకుంటారు. రిస్కీ సన్నివేశాలు డూప్ ల సాయంతో చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అయితే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలోవిశాల్(Vishal) డూప్ ను వాడేందుకు ఇష్టపడడు. ఎంత రిస్కీ షాట్లు అయినా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తరచూ గాయాలపాలు అవుతుంటాడు.
విశాల్ గత చిత్రం లాఠీ చిత్రీకరణలో సమయంలో రెండుసార్లు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లో సినిమా చిత్రీకరణ సమయంలో ఫైటర్స్ బీర్ బాటిల్ విసిరిన సమయంలో అది విశాల్ కి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నైలో అదే సినిమా క్లైమాక్స్ షూటింగ్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన కాలికి తీవ్ర గాయమైంది.
ఇప్పుడు విశాల్(Vishal) మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం విశాల్ అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ ఆంటోని అనే సినిమా చేస్తున్నాడు. ఇవాళ తెల్లవారు జామున చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో విశాల్ కు తీవ్ర గాయాలు అయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వెంటనే ఆయన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా ఈ సినిమాలో సూర్య మరో కీలక పాత్రలో నటిస్తుండగా, రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో అంచనాలతో విడుదలైన లాఠీ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపైనే విశాల్ ఆశలు పెట్టుకున్నాడు.