రానా దగ్గుబాటి.. ఓ విలక్షణ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించే నటుడు. ఎలాంటి పాత్రనైనా అందులో దమ్ముంటే చేసేందుకు వెనకాడని నటుడు. అయితే ఇప్పుడు ఇదే విలక్షణ నటుడు మరో బాహుబలి లాంటి సినిమాలో లీడ్ రోల్ చేసేందుకు సన్నద్దమయ్యాడు. ఈ సినిమా దాదాపు రూ.200కోట్ల బడ్జెట్‌కు పైగానే అవుతుందని చిత్ర పరిశ్రమ టాక్. అయితే ఇంతకు రానా దగ్గుబాటి ఏ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలకెక్కుతుంది.. దీని దర్శకుడు ఎవ్వరు.. ఏ జానర్‌లో తీయబోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
రానా ఆరోగ్యం బాగా లేక అనేక ప్రాజెక్టులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తిరిగి పూర్వవైభవం సంతరించుకున్న రానా తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రానా కోసం ఆగిపోయిన వేణు ఊడ్గుల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం విరాట పర్వం. అయితే ఈ సినిమాతో పాటుగా హిరణ్యకశ్యప చిత్రం చేయాల్సి ఉంది. ఈ చిత్రం గత రెండేళ్ళుగా ప్రీ ప్రోడక్షన్ పనుల్లోనే నిలిచిపోతుంది. ఈ సినిమాను తెరకెక్కించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దర్శకుడు గుణశేఖర్ కల నెరవేరడం లేదు.
అయితే ఇప్పుడు రానా ఆరోగ్యం ఓకే కావడం.. తిరిగి షూటింగ్‌లు చేసేందుకు తగిన కరసత్తులు చేస్తుండటంతో ఆగిపోయిన హిరణ్యకశ్యప సినిమా తెరకెక్కేనా అనే సందేహాలు కమ్ముకున్నాయి. అయితే హిరణ్య కశ్యప సినిమా పై నెలకొన్న సందేహాలు తొలగిపోయాయి. రానా దగ్గుబాటి ఈ సందేహాలకు నివృత్తి చేశారు. త్వరలో హిరణ్యకశ్యప సినిమా తెరకెక్కుతుందని, ఈ సినిమా బాహుబలిని మించి పోతుందని, బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి దిగులు లేదని, దాదాపు రూ.200కోట్లక పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని రానా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.
అయితే రానా దగ్గుబాటి చెపుతున్న దాని ప్రకారం ఈ సినిమాను రానా సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్‌లోనే తీసేందుకు సిద్దమయ్యారని రానా వెల్లడించారు. నిర్మాత డి.సురేష్‌బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా 2020 చివరిలో సెట్స్‌మీదకు వెళుతుందనే సంకేతాలను ఇచ్చాడు రానా. సో రానా దగ్గుబాటి విరాట పర్వం పూర్తి చేసి హిరణ్య కశ్యప సినిమాలోకి ఎంటర్ అవుతారన్న మాట. ఏదేమైనా రానా ఈ సినిమా ఆగిపోలేదని అదంతా ఒట్టి పుకారే అని కొట్టిపారేసారు. అంటే గుణశేఖర్, రానా కాంబినేషన్‌లో మరో త్రీడి టెక్నాలజీతో మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నారన్న మాట.