రామ్ “ది వారియర్” ఫస్ట్ డే కలెక్షన్స్

మాస్ డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్‌లో ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా ,ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది వారియర్’. జులై 14 విడుదలైన ఈ సినిమా ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లను రాబడుతోంది.

ఫస్ట్ రోజు “ది వారియర్” తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు కలెక్ట్ చేసింది రామ్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌లో ఇదొకటి. రివ్యూలు అంతగొప్పగా ఇవ్వకపోయినా వారాంతంలో మంచి వసూళ్లను రాబట్టాలని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ, నదియా మరియు ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Tags: aadi pinishetty, director lingaswamy, Krithi Shetty, ram pothineni, ram the warrior first day collections