“ఏజెంట్ ” టీజర్ ….కేకపుట్టిస్తున్న అఖిల్ !

రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్2సినిమా పతాకాలపై అఖిల్ అక్కినేని హీరోగా అనిల్ సుంకర ‘ఏజెంట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఏజెంట్’ ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది.

మొదటి నుంచీ చెబుతున్నట్లుగానే సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ చిత్రాన్ని చాలా స్టైలిష్ గా రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ.. హిప్ హాప్ తమిజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అజయ్ సుంకర మరియు పతి దీపా రెడ్డి ఈ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించగా.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Tags: agent movie teaser, akhil agent movie, akhil akkineni, director surenderreddy