అల్లు అర్జున్ రైట్ జడ్జిమెంట్తో బుకైనా రామ్ పోతినేని !

పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది .దానికంటే ముందే పాన్-ఇండియా క్రేజ్ రావడానికి చాలా ముందుగానే, అల్లు అర్జున్ తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. బన్నీ AR మురుగదాస్ వంటి అగ్ర తమిళ చిత్రనిర్మాతలతో కలిసి పనిచేయడానికి ప్రయత్నించాడు. కానీ చివరగా లింగుసామితో కలిసి చెన్నైలో ఓ సినిమాని భారీగా లాంచ్ చేశాడు.అంత పెద్ద ప్రారంభం తర్వాత, అల్లు అర్జున్‌తో ఎన్ లింగుసామి సినిమా ఆర్థిక సమస్యలు మరియు క్రెయేటివిటీ విభేదాల కారణంగా ఆగిపోయింది. అప్పుడికే అల్లు అర్జున్‌కి ఆ స్క్రిప్ట్‌పై స్పష్టత లేదు. కాబట్టి, అతను వెనక్కి తగ్గాడు.

అప్పుడే లింగుసామి టాలీవుడ్ లో మిగతా హీరోలను సంప్రదించి చక్కర్లు కొట్టాడు. ఎట్టకేలకు రామ్ పోతినేనిని తన దర్శకత్వంలో నటించమని ఒప్పించాడు. ఆ విధంగా, “ది వారియర్” జరిగింది.రామ్ జడ్జిమెంట్ తప్పు అని తేలితే, అల్లు అర్జున్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. “ది వారియర్” ప్లాప్ అయ్యింది . తమిళ మార్కెట్‌ని పట్టుకునేందుకు రామ్ వేసిన లెక్కలు వర్కవుట్ కాలేదు.వారి నిర్ణయం సరైనది కానిది – రామ్ లేదా అల్లు అర్జున్? ఫలితాలు మాట్లాడుతున్నాయి.

Tags: allu arjun, director lingaswamy, ram pothineni, telugu news, the warrior, tollywood news