తన పెళ్లి గురించి రెండు అదిరిపోయే అప్‌డేట్లు ఇచ్చిన ప్ర‌భాస్‌… కేకో కేక‌…!

మన తెలుగులో మోస్ట్ బ్యాచిలర్ హీరోల‌లో ప్రభాస్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడ‌ని ? వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవట్లేదు. దివంగత నటుడు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా డార్లింగ్ పెళ్లి చూడాలని ఆశపడ్డారు. కానీ ఆయన కోరిక తీరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ప్రభాస్ అభిమానులు కూడా తమ అభిమాన‌ హీరో తొందరగా పెళ్లి చేసుకోవాలని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఆశ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ ను అభిమానులు స్టేజిపై ఉండగానే పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించారు. ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాతో ఈ నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. గ‌త రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ జరుగుతున్న క్రమంలోనే హీరో ప్రభాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

ప్రభాస్ మాట్లాడుతుండగా పెళ్లి ఎప్పుడు ? అని అభిమానులు గ‌ట్టిగా నినాదాలు చేయగా దాంతో ప్రభాస్ అభిమానులకు పెళ్లిపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి త్వరలోనే ఈ తిరుపతిలోనే జరుగుతుందంటూ నవ్వుతూ వాళ్లకి సమాధానం ఇచ్చాడు. ఇక దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా ప్రభాస్ మాట్లాడుతూ సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

ఏదేమైనా త‌న పెళ్లి త్వ‌ర‌లోనే అని చెప్ప‌డంతో పాటు తిరుప‌తిలోనే అని చెప్పి పెద్ద ట్విస్టే ఇచ్చాడు.
ఇక ఈ ఆది పురుష్ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన‌ ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో ఈ పాన్ ఇండియా హీరో బాక్సాఫీస్ ను ఏ విధంగా షేక్ చేస్తాడో చూడాలి.