పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తన కెరీర్ లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ హరి హర వీర మల్లులో నటిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం పవన్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ సీక్వెన్స్‌ని ఆయన షూట్ చేస్తున్నారు. ఇందులో పవన్‌తో పాటు దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులు పాల్గొంటున్నారు.
ఈ యాక్షన్ సినిమాలో కీలకమైన ఎపిసోడ్ గా వస్తుంది అందుకే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఫైట్ సీక్వెన్స్‌లో పవన్ కొత్త లుక్‌తో కనిపిస్తాడని అది సినిమా హైలైట్‌లలో ఒకటిగా ఉంటుందని తెలుస్తోంది.