కమల్ హాసన్ ‘విక్రమ్’కి ఘోరమైన ‘TRP’

కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ యూనివర్సల్ హీరో గ్రాండ్ కం బ్యాక్ మూవీ చెప్పొచ్చు . చాలా కాలం తర్వాత కమల్ కి చాలా అవసరమైన హిట్‌ని అందించింది. లోకేష్ కనగరాజ్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించాడు.ఇది తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే తమిళ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షాకింగ్ 4.42 TRPని నమోదు చేసింది. ఈ చిత్రం తమిళ పరిశ్రమలో అతిపెద్ద కలెక్షన్స్ వచ్చిన సినిమా కాబట్టి ఇది మరింత ఆశ్చర్యకరమైనది. OTT లో ముందు అందరు చూసారు కాబట్టి ఈ తక్కువ TRP వెనుక ఉన్న ముఖ్య కారణాలలో ఒకటిగా చెప్పొచ్చు.

విక్రమ్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటించారు.అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.ఈ సినిమా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది. అతి త్వరలో ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రోల్ ప్రారంభం కానుంది.

Tags: actor kamalhaasan, vikram movie, vikram movie TRP