పవన్ కళ్యాణ్ ‘ బ్రో ‘ ప్రి రిలీజ్ బిజినెస్.. మామ‌, అల్లుడు ముందు బ్రేక్ ఈవెన్ టెన్ష‌న్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమా షూటింగ్ లతో పాటు వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్. ప్రస్తుతం పవన్- సాయి ధరమ్‌తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈవెంట్ కు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ గెస్ట్‌లుగా వ‌చ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్లో సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాడు. ఇప్పటికే టీజ‌ర్, ట్రైలర్‌తో సినిమాపై అంచ‌నాలు మరో లెవల్ కు వెళ్లాయి. ఇక ఇప్పుడు ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.

నైజాం: 30 కోట్లు

సీడెడ్: 13.20 కోట్లు

ఉత్త‌రాంధ్ర‌: 9.50 కోట్లు

ఈస్ట్‌: 6.40 కోట్లు

వెస్ట్‌: 5.40 కోట్లు

గుంటూరు: 7.40 కోట్లు

కృష్ణ: 5.20 కోట్లు

నెల్లూరు: 3.40 కోట్లు
———————————–
AP-TG మొత్తం:- 80.50 కోట్లు
————————————
CR,KA+ROI: 5Cr, OS: 12 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్: 97.50 కోట్లు

(బ్రేక్ ఈవెన్ – 98.50 కోట్లు )

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.97 కోట్లకు పైగా భారీ ఫ్రీరీలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.98 కోట్లకు పైగా షేర్ రాబట్టాలి. పవన్ కళ్యాణ్ నటించిన గత సినిమాలు కూడా ఇదే విధంగా భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. కానీ ఆ సినిమాలు హిట్ అయినా నిర్మాతలకు మాత్రం సరైన లాభాలు తెచ్చి పెట్టలేకపోయాయి. అందుకు ప్రధాన కారణం ఏపీలో పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై యుద్ధం ప్రకటించడంతో ఇప్పటికే ఆయనను తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.