ఆ క‌మ్మ కోట‌లో 25 ఏళ్ల త‌ర్వాత టీడీపీ జెండా ఎగురుతోందా…!

తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉండి..కీలకమైన కమ్మ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నా సరే వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కందుకూరు నియోజకవర్గం…ఇక్కడ టి‌డి‌పి అసలు గెలిచింది రెండుసార్లు మాత్రమే..1994, 1999 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి దివి శివరాం గెలిచారు. అంతే టి‌డి‌పి అదే చివరిగా గెలవడం.

TDP chief N Chandrababu Naidu accuses NDA govt of using CBI, IT to harass  rivals, create fear - The Economic Times

మళ్ళీ ఇంతవరకు టి‌డి‌పి గెలవలేదు..2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. ఇలా వరుసగా ఓడిపోతూనే వస్తుంది. అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. దివి శివరాం, పోతుల రామారావు లాంటి వారు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక ఇంటూరి వచ్చాక కందుకూరులో టి‌డి‌పి బలం పెరిగిందనే చెప్పాలి. ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు..ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.

ఇక ఎక్కడైనా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సొంత సబ్బులు సైతం ఖర్చు పెడుతున్నారు. పార్టీని గెలిపించడం కోసం ఆయన కష్టపడుతున్నారు. అయితే ఆయన ఎంత కష్టపడుతున్నారో తాజాగా నెల్లూరు లో చంద్రబాబు జోనల్ సమావేశాల్లో తేలింది. బాబు నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకుని..ఎవరి పని తీరు ఎలా ఉందో చెప్పారు. ఇక టాప్ టెన్ స్థానాల్లో కందుకూరు 5వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 70 శాతం పైనే అన్నీ కార్యక్రమాలు విజయవంతంగా నడిపిస్తున్నారు.

Inturi Nageswara Rao Arrested In Kandukur Stampede Incident - Sakshi

ఇంచార్జ్ గా ఉన్న ఇంటూరి పార్టీలో దూకుడుగా పనిచేస్తున్నారు..అందుకే కందుకూరు 5వ స్థానంలో నిలిచింది. అంతే గతం కంటే ఇప్పుడు కందుకూరులో టి‌డి‌పి పరిస్తితి మెరుగైందనే చెప్పాలి. ఇక మిగిలిన నేతలు గ్రూపులు కట్టకుండా..అంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కందుకూరులో టీడీపీ జెండా ఎగిరే ఛాన్స్ ఉంటుంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp