ఎన్టీఆర్ వ‌ర్సెస్ కృష్ణ వార్‌… ఇంట్ర‌స్టింగ్ ట్విస్టులు… ఎత్తులు, పై ఎత్తులు ఇవే..!

అన్న‌గారు.. ఎన్టీఆర్‌తో న‌ట శేఖ‌ర కృష్ణ‌కు మంచి అనుబంధ‌మే ఉండేది. అయితే.. కొన్నాళ్ల‌కు వివాదం ఏర్ప‌డింది. దీంతో ఎన్టీఆర్ క‌న్నా కూడా.. కృష్ణ సీరియ‌స్‌గాను.. ప్ర‌తిష్టాత్మ‌కంగాను తీసుకున్నారు. రాజ‌కీ యాల నుంచి సినిమాల వ‌ర‌కు కూడా అన్న‌గారితో పోటీ ప‌డ్డారు. ఇది.. కొన్ని కొన్ని సార్లు స‌క్సెస్ అయి నా.. త‌ర్వాత మాత్రం ఫెయిల్యూర్ అయింది. ఆరాధ‌న సినిమా అన్న‌గారు తీశారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది.

Krishna - NTR : ఎన్టీఆర్ తో కృష్ణకు ఎందుకు విబేధాలు వచ్చాయో తెలుసా ? - Jaiswaraajya TV

దీనిలో భ‌గ్న‌ప్రేమికుడిగా అన్న‌గారి యాక్ష‌న్ అదిరిపోయింది. అదే స‌మ‌యంలో వాణిశ్రీ కూడా.. మంచి అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. దీనికి పోటీగా.. హీరో కృష్ణ కూడా.. సినిమా తీశారు. దానికి కూడా ఆరాధ‌న అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో కృష్ణ హీరోగా న‌టించారు. అయితే.. ఈ సినిమా అనుకున్న విధంగా స‌క్సెస్ సాధించ‌లేదు. దీంతో డిస్ట్రిబ్యూట‌ర్లు న‌ష్ట‌పోయారు. ఈ న‌ష్టాన్ని కృష్ణ భ‌ర్తీ చేయాల్సి వ‌చ్చింది. అదేవిధంగా కృష్ణావ‌తారం అని అన్న‌గారు సినిమా చేశారు.

వీరాభిమాని, ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్‌తో కృష్ణ‌కు ఆ కార‌ణంతోనే గ్యాప్ వ‌చ్చిందా...! - Telugu Lives

దీనికి పోటీగా హీరో కృష్ణ కూడా కృష్ణావ‌తారం టైటిల్‌తో సినిమా చేశారు. ఇది కూడా విఫ‌ల‌మైంది. ఇక‌, రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికికాంగ్రెస్ త‌ర‌ఫున కృష్ణ ప్ర‌చారం చేశారు. కానీ, అన్న‌గారి త‌ర‌ఫున ఇండ‌స్ట్రీ అంతా నిల‌బ‌డింది. దీంతో కొన్నాళ్ల పాటు.. ఇండ‌స్ట్రీలో ఉన్న న‌టీన‌టులు.. హీరో కృష్ణ‌కు స‌హ‌క‌రించ లేదు. దీంతో రెండేళ్ల పాటు.. సినిమాలు మానుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే.. కృష్ణ పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన వారితో సినిమాలు తీశారు.

వీరాభిమాని, ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్‌తో కృష్ణ‌కు ఆ కార‌ణంతోనే గ్యాప్ వ‌చ్చిందా...! - Telugu Lives

అయితే.. అదేస‌మ‌యంలో అన్న‌గారు మాత్రం ఇలాంటి పోటీ వాతావ‌ర‌ణానికిదూరంగా ఉండేవారు. అల్లూ రి సీతారామరాజు సినిమా హీరో కృష్ణ చేసిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ దానిని తీయాల‌ని అన్న‌గారు అనుకోలేదు. వాస్త‌వానికి ఈ సినిమాను అన్న‌గారే చేయాల‌ని అనుకున్నారు. ఈ విష‌యం తెలిసిన కృష్ణ‌.. అన్న‌గారి కంటే ముందే.. త‌ను తీయాల‌ని నిర్ణ‌యించుకుని అలానే చేశారు. ఈ సినిమా హిట్ట‌యింది. దీంతో అన్న‌గారు ఈ సినిమా జోలికి పోకుండా త్యాగం చేశారు. అన్న‌గారితో పోటీ ప‌డిన కృష్ణ క‌ష్టాలు ప‌డ్డారు .. కానీ, అన్న‌గారు మాత్రం ప్ర‌శాంతంగా ఉన్నార‌న్న ప్ర‌చార‌మే అప్పట్లో ఎక్కువుగా జ‌రిగేది.