NTR : విజయవాడ హెల్త్ వర్సిటీ నుంచి ఎన్.టి.ఆర్ పేరుని తొలగిస్తూ బిల్ పాస్ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ గట్టిగానే పోరాడుతుంది. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడికి ఇది చాలా పెద్ద అన్యాయమని అంటున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ముమ్మాటికీ తప్పని అంటున్నారు.
ఈ విషయంపై జూనియర్ ఎన్.టి.ఆర్ స్పందించారు. ఎవరినీ టార్గెట్ చేయకుండా ఎన్.టి.ఆర్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఎన్.టి.ఆర్ చేసిన ట్వీట్ ఏంటంటే.. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాధారణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈరకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకొన్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు. అని రాసుకొచ్చాడు.
ఎన్.టి.ఆర్ స్పందనకై ఎదురుచూస్తున్న టీడీపీ నేతలు ఎన్.టి.ఆర్ స్పందించిన తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే సినీ పరిశ్రమలో తానొక హీరోగా ఉన్న కారణం చేత తన సినిమాలు ఏపీలో టార్గెట్ చేయబడతాయనే ఉద్దేశం చేత ఎన్.టి.ఆర్ ఏపీ అధికార పార్టీని ధూషించకుండా అసలు వారి ప్రస్థావనే తీసుకురాకుండా ట్వీట్ చేసి ఉండొచ్చని అంటున్నారు.
ఇక ఇదే విషయంపై కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు. తాతగారు 1986 లో స్థాపించిన హెల్త్ యూనివర్సిటీకి ఇప్పుడు పేరు మార్చడం కరెక్ట్ కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయం పేరుని అకస్మాత్తుగా మార్చడం తనకు బాధ అనిపించిందని అన్నారు కళ్యాణ్ రామ్.
— Jr NTR (@tarak9999) September 22, 2022