“చరణ్ బర్తడే పార్టీకి ఎన్టీఆర్ డుమ్మా”..ఫ్యాన్స్ ఈగో ని కెలుకుతున్నారు కదా రా వెధవల్లారా..?

సోషల్ మీడియా పుణ్యమాంటూ .. ఏ న్యూస్ అయినా సరే సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది . మరి ముఖ్యంగా సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ ని కూడా పబ్లిక్ గా ట్రోల్ చేయడంలో ఈ మధ్యకాలంలో ట్రోలర్స్ ముందు వరుసలో ఉంటున్నారు . అది ఎలాంటి హీరో అయినా సరే ..స్టార్ట్ కాదు …సూపర్ స్టార్ కాదు ..పాన్ ఇండియా స్టార్ కాదు ..గ్లోబల్ స్టార్ కాదు.. ఎవరినైనా సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు . కాగా రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఇచ్చిన గ్రాండ్ పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Charan's Bash: Upasana Kamineni Flaunts Baby Bump In A Bodycon Dress,  Kajal Aggarwal-Gautam Join

మనకు తెలిసిందే సోమవారం మార్చి 27న రామ్ చరణ్ తన బర్త డే ను గ్రాండ్గా జరుపుకున్నారు . ఈ పార్టీకి టాలీవుడ్ సినీ ప్రముఖులంతా వచ్చి సందడి చేశారు . డైరెక్టర్ రాజమౌళి , మంచు లక్ష్మి, మనోజ్, మౌనికా రెడ్డి, రానా దగ్గుబాటి , విక్టరీ వెంకటేష్, కాజల్ అగర్వాల్ , అడవి శేషు తో పాటు పలువురు సినీ ప్రముఖులు ..ఈ పార్టీకి హాజరై హంగామా చేశారు . అయితే ఈ పార్టీలో చరణ్ కి ఎంతో జాన్ జిగిడి దోస్త్ అయిన ఎన్టీఆర్ కనిపించలేదు .

SS Rajamouli, Nagarjuna, Vijay Deverakonda and Other Celebs Attend Ram  Charan's Star-Studded Birthday Bash (Watch Videos) | LatestLY

అంతేకాదు మెగా ఫ్యామిలీలో ఒకరైన అల్లు అర్జున్ కూడా ఈ పార్టీలో కనిపించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది . తారక్ – చరణ్ ఎంత క్లోజ్ గా ఉంటారో మనందరికీ బాగా తెలిసిందే. ఇద్దరు అన్నదమ్ముల కంటే ఎక్కువ మింగిల్ అవుతారు . అలాంటి తారక్ ఎందుకు ఈ పార్టీకి రాలేదు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే తారక్ ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్లో భాగంగా బిజీగా ఉన్నారని.. ఆ కారణంగానే రాలేకపోయారని.. అయినా సరే ఎంతో ఇష్టమైన వాచ్ ను గిఫ్ట్ గా పంపించారు అంటూ తెలుస్తుంది .

Jr NTR on his Oscars 2023 appearance: Not going to walk the red carpet as  an actor from Indian film industry, I'm going to walk as an Indian | Hindi  Movie News -

అంతేకాదు బన్నీ కూడా పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్నాడని ..ఈ క్రమంలోనే ఆయన బర్త డే పార్టీకి రాలేకపోతున్నానని స్పెషల్గా ముందుగానే చరణ్ కు మెసేజ్ చేశారని తెలుస్తుంది . అయితే సోషల్ మీడియాలో కొందరు పని పాట లేని బ్యాచ్ ఇలా తారక్ – ఎన్టీఆర్ – చరణ్ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ..ఇకనైనా ఆ వెధవలు ఈ చిల్లర పనులు మానుకుంటే బెటర్ అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు వాళ్లు ఎప్పుడూ మంచి ఫ్రెండ్స్ లానే ఉంటారని .. దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపండి అంటూ ఫ్యాన్స్ సైతం సజెషన్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోని చరణ్ బర్త్ డే పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, ram charan, ram charan birthday celebrations, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news