జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీలో టీడీపీ యంగ్ లీడ‌ర్‌…!

తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ ఈ రెండు పేర్లకు ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ముందు నుంచి వీరాభిమాని. ఈ క్రమంలోనే 2009 అసెంబ్లీ ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఉత్తరాంధ్ర‌లో చాలా రోజులపాటు ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారం జరుగుతుండగానే జూనియర్ ఎన్టీఆర్ కు అనూహ్యంగా యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన హాస్పటల్ నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.

అయితే గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఎంత లేదన్న జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశంకు కాస్త గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఎన్టీఆర్ సన్నిహితుడు అయిన మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఇప్పుడు వైసీపీలో ఉండడంతో పాటు.. తెలుగుదేశం, చంద్రబాబు పేరు చెప్తేనే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌కు మరో సన్నిహితుడు అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైసీపీకి దగ్గరయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు కూడా గత ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు.

NTR Jr wishes wife Lakshmi Pranathi on birthday with throwback photo |  Regional Indian Cinema

ఇటు ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ హిందూపురం టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశంకు ఇటీవల కాలంలో సరైన సంబంధాలు లేవన్నది నిజం. ఇలాంటి సమయంలో ఒక షాకింగ్ ఫోటో బయటకు వచ్చింది. టిడిపికి చెందిన ఓ యువ నాయకుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటో వైరల్ అవుతుంది. ఆ యువనేత ఎవరో కాదు టిడిపిలో సీనియర్ నేతలుగా పేరున్న జెసి సోదరుల్లో ఒకరు అయిన జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి.ఈనెల 26వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ప్రైవేటు పార్టీలో అస్మిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అస్మిత్ రెడ్డి కొంతసేపు ఎన్టీఆర్ తో పాటు.. అతని భార్య ప్రణతి రెడ్డితో కలిసి కొంత సమయం గడిపినట్టుగా ఆ ఫోటో చెబుతోంది.

DYK Jr NTR hosted a fun birthday bash for wife Lakshmi Pranathi? Unseen  pics are out - India Today

అంటే అస్మిత్ రెడ్డికి.. ఈ నందమూరి హీరోకి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందా ? అన్నది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈ ఫోటో చూశాకే ఈ విషయం బయటకు వచ్చింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి శ్రేణులు కూడా ఈ ఫోటోను బాగా షేర్ చేస్తున్నారు. అస్మిత్ రెడ్డి 2019 ఎన్నికలలో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 6000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికలలోను ఆయన మరోసారి తాడిపత్రి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన ప్రైవేటు పార్టీలో అస్మిత్ రెడ్డి పాల్గొనటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news