Karthikeya 2 : బాలీవుడ్ లో నిఖిల్ హవా.. 60 నుంచి 300 పెరిగిన కార్తికేయ 2 థియేటర్లు..!

బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతుంటే మరోపక్క తెలుగు సినిమాలు మరోసారి బాలీవుడ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. లాస్ట్ ఫ్రై డే రెండు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో ఒకటి ఆమీర్ ఖాన్ సినిమా కాగా మరొకటి అక్షయ్ కుమార్ సినిమా.. ఈ రెండు సినిమాల మధ్య తెలుగు యువ హీరో నిఖిల్ కార్తికేయ 2 కూడా హిందీలో రిలీజైంది.

కార్తికేయ సినిమా సూపర్ హిట్ అవడంతో కార్తికేయ 2 ( Karthikeya 2) ని మరింత గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా ద్వరకా బ్యాక్ డ్రాప్ లో కృష్ణుడి గురించి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు హిందీలో అనూహ్యమైన స్పందన వస్తుంది. ఫస్ట్ డే 60 థియేటర్లు మాత్రమే రిలీజైన కార్తికేయ 2 సినిమా రెండో రోజుకి 300 థియేటర్లకు చేరింది. కార్తికేయ 2 హిందీలో హౌజ్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకెళ్తుందని తెలుస్తుంది.

సినిమాలో అనుపం ఖేర్ కూడా నటించడం Karthikeya 2 సినిమాకు ప్లస్ అయ్యింది. మొత్తానికి నిఖిల్ పడిన కష్టానికి నేషనల్ లెవల్ లో గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు. రెండో రోజు థియేటర్లు పెరగగా వసూళ్లు కూడా అదిరిపోయాయని తెలుస్తుంది.

Tags: Anupama Parameswaran, Bollywood, Chandu Mondeti, karthikeya 2, karthikeya 2 movie, Nikhil