Hebah Patel : హీరోయిన్ అవ్వకముందే డేటింగ్.. ప్రస్తుతం సింగిలే.. అలాంటోడినే పెళ్లాడుతా..!

కుమారి 21F సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ సినిమా టైం లో యూత్ ఆడియెన్స్ కి నిద్రపట్టకుండా చేసింది ఈ అమ్మడు. అయితే ఆ తర్వాత కూడ అదే హాట్ ఇమేజ్ కొనసాగించాలని ప్రయత్నించినా సరే వర్క్ అవుట్ అవలేదు. ప్రస్తుతం అర కొర సినిమా ఛాన్సులతో అలరిస్తున్న హెబ్బా పటేల్ ఓదెల రైల్వేస్టేషన్, తెలిసినవాళ్లు సినిమాల్లో నటిస్తుంది. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని అలరిస్తుంది అమ్మడు.

ఇక లేటేస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్ (Hebah Patel). హీరోయిన్ అవ్వకముందే డేటింగ్ చేశానని. అయితే అతను ఇండస్ట్రీ కి సంబందించిన వ్యక్తి కాదని. అది బ్రేకప్ అయ్యాక సినిమాలతో బిజీ అయ్యానని. ఇక తర్వాత డేటింగ్ చేసే టైం లేదని చెప్పింది. ఇక తనకు రాబోయే భర్త తనని ప్రేమగా చూసుకోవాలని.. ఓవర్ కాంఫిడెన్స్ అసలు ఉండకూడదని.. తాను ఎక్కువగా మాట్లాడుతా కాబట్టి తను తక్కువ మాట్లాడాలని. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని అంటుంది హెబ్బా పటేల్.

మొత్తానికి కాబోయే వాడి గురించి కలలు కటుంది అంటే హెబ్బా పటేల్ (Hebah Patel) కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. సినిమాలు లేకపోతే పెళ్లి చేసుకోవడమే బెటర్ కద.

Tags: Hebah Patel, Hebah Patel Hot, Hebah Patel Updates, Kumari Hebah Patel, Tollywood