తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగిన సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మ గా, వదినగా, అక్కగా ఇలా ఎన్నో పాత్రలను పోషించింది. ఆమె చేసిన పాత్రలకు తగ్గ గుర్తింపు పొందింది సురేఖవాణి. ప్రస్తుతం సినిమాల్లో ఆమె అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన కూతురు సుప్రియతో కలిసి దిగిన ఫోటోస్ షేర్ చేసుకుంటూ అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ల ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది సురేఖ.
అయితే ప్రస్తుతం ఛాన్సులు లేక ఖాళీగా ఉంటున్నారు.. కాని ఒక్కపుడు చాలా బిజీ షెడ్యూల్ తో వరుస సినిమాల్లో నటించింది సురేఖ. ప్రస్తుతం సినిమా ఛాన్సులు తగ్గడంతో ఆమె తన కూతురితో పాటు విదేశీ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది. కూతురితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా బాగా ట్రోలింగ్ కి గురయ్యారు.
సురేఖ కామెంట్స్ కు ఎక్కువగా రియాక్ట్ అవదు. బాగా కామెంట్స్ మితిమీరినప్పుడు మాత్రమే వాటికి ఘాటైన సమాధానం ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం సురేఖ తన కూతురు కలిసి ఒక లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. అయితే షోరూంలో కొనుగోలు చేసేటప్పుడు వారిద్దరు కలిసి ఆ కార్ తో ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో సుప్రియ పోస్ట్ చేయగా ఆ ఫోటో వైరల్ గా మారింది.
సుప్రియ ఆ ఫోటో షేర్ చేసేటప్పుడు మంచి విషయాలు జరగడానికి కొంచెం టైం పడుతుంది అంటూ కామెంట్ పెట్టింది. ఆ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ వారికి విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వారు ఆ కార్ ను కొన్న హ్యాపీనెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు.