నారా లోకేష్ ‘ యువ‌గ‌ళం ‘ సంచ‌ల‌నం… బ్రేక్ అయిన రికార్డులు ఇవే..!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాద‌యాత్ర యువ‌గ‌ళం. భారీ అంచ‌నాల తోనే ఈ పాద‌యాత్ర ప్రారంభ‌మైనా.. అనూహ్యంగా మ‌ధ్య‌లో కొంత మంద‌గించింది. గ్యాప్ లు ఎక్కువ‌గా వ‌చ్చాయి. పైగా ప్రారంభించిన రోజే తార‌క‌ర‌త్న గాయ‌ప‌డి మ‌ర‌ణించారు. దీంతో కొంత వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయ‌నేది టీడీపీ నేత‌ల భావ‌న‌. అయితే.. అనూహ్యంగా ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత‌.. పుంజుకుంది.

Lokesh Padayatra: 15వ రోజు లోకేష్ పాదయాత్ర మొదలు | TDP Leader Nara Lokesh YuvaGalam Padayatra 15th day start Chittoor Andhrapradesh Suchi

దీంతో షెడ్యూల్ క‌న్నా వేగంగానే పాద‌యాత్ర ముందుకు సాగుతోంద‌ని రికార్డులే చెబుతున్నాయి. వాస్త‌వా నికి ఆదిలో నిర్ణ‌యించుకున్న షెడ్యూల్ ప్ర‌కారం.. మొత్తం 400 రోజులు ఈ యాత్ర సాగాలి.ప్ర‌తి 100 రోజుల‌కు వెయ్యి కిలో మీట‌ర్లు చెప్పున 4000 కిలో మీట‌ర్ల‌ను న‌డ‌వాల‌నేది .. టార్గెట్. అయితే.. అనూహ్యంగా 77 రోజుల‌కే 1000 కిలో మీట‌ర్ల దూరాన్ని యువ‌గ‌ళం పూర్తి చేసుకుంది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం.

Nara Lokesh: Nara Lokesh Padayatra in the name of 'Yuvagalam' - Country and Politics

పాద‌యాత్ర‌లో అన్ని గ్రామాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. అంద‌రినీ స‌మ‌న్వ యం చేసుకుంటున్నారు. దీంతో నిజానికి పాద‌యాత్ర ఆల‌స్యం కావాలి. పైగా విరామాలు కూడా ఎక్కువ‌గా నే వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. నారా లోకేష్ చాలా వేగంగా పాద‌యాత్ర‌ను పూర్తి చేస్తూ.. తాను నిర్ణ‌యించు కున్న ల‌క్ష్యాన్ని తానే అధిగ‌మించి.. స‌రికొత్త రికార్డుల దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

Naidu's son Lokesh to embark on 4,000 km long padayatra in AP | Latest News India - Hindustan Times

ఇదే ఊపు కొన‌సాగితే.. 4000 కిలో మీట‌ర్లు దూరం పూర్తి చేసేందుకు 300 రోజులు స‌రిపోతాయ‌ని.. ఖ‌చ్చితం గా ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందుగానే ఈ పాద‌యాత్ర పూర్త‌వుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు సీనియ‌ర్లు.ఇక‌, ఈ యాత్ర‌లో క‌మిటీల స‌మ‌న్వ‌యం.. ఏర్పాట్లు.. సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మం.. భ‌ద్ర‌త వంటివి అన్నీ కూడా.. హై రేంజ్‌లో కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి యువ‌గ‌ళం అంచ‌నాల‌కు మించి కొనసాగుతోంద‌న‌డంలో సందేహం లేదు.