టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర.. ప్రస్తుతం ఉమ్మ డి గుంటూరు జిల్లాలో సాగుతున్న విషయం తెలిసిందే. దిన దిన ప్రవర్థమానం.. అన్నట్టుగా ఈ యాత్ర జిల్లాలో రోజు రోజుకు విశేష ఆదరణ పొందుతోంది. గురజాల, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి.. వంటి నియోజకవర్గాల్లో దుమ్మురేపిన యాత్ర.. నేల చెరగులా కదిలి వచ్చిందా.. అన్న తీరులో ప్రజల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది.
ఇక, గురజాలలో దిగ్విజయంగా సాగిన యువగళం పాదయాత్ర అక్కడ నుంచి బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో పెద్దకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి ప్రవేశించింది. ఇక్కడ టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. అయినా.. ఎక్కడా పార్టీకి ఆదరణ ఇసుమంత కూడా తగ్గలేదు. పైగా.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేనున్నానంటూ.. వారికి భరోసా నింపుతున్నారు.
దీంతో 2014కు ముందు ఎలాంటి ప్రజాదరణ ఉందో.. ఇప్పుడు అంతకుమించి అన్న విధంగా ప్రజలు కొమ్మాలపాటికి బ్రహ్మరథం పడుతున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా.. కొమ్మాలపాటినే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై నియోజకవర్గ ప్రజల ఆశలు ఎప్పుడో అడుగంటేశాయి. ఈ క్రమంలోనే అద్దంకి నుంచి ఒక్కసారిగా ఉవ్వెత్తున పుంజుకున్న లోకేష్ పాదయాత్రను దర్శి, వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లిలో ఎలా రైజ్ చేశారో.. దానినే శ్రీధర్ కూరపాడు నియోజకవర్గంలోనూ కంటిన్యూ చేసేలా ప్లాన్ చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగిసిన యువగళం పాదయాత్ర పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి అడుగులు వేసిన నేపథ్యంలో భారీ ఎత్తున నియోజకవర్గంలోని ప్రజలు తరలి వచ్చి.. కొమ్మాలపాటి సారథ్యంలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. గజమాలలతో ఆయనను సత్కరించారు. ఇసకేస్తే రాలనంతగా జనం రావడంతో చాలా ఆలస్యంగా పెదకూరపాడులోకి యాత్ర నెమ్మదిగా సాగింది. ఇక, ఈ పరిణామాలు చూసిన వారు స్వాగతమే ఇలా ఉంటే.. ఇక, యాత్ర ఇక్కడ ముగిసే వరకు ఒక రేంజ్‌లోనే కంటిన్యూ కానుంది.