ఎంతోమంది హీరోయిన్లు వెంట‌ప‌డుతున్నా.. ఆ ఒక్క కార‌ణంతో మ‌హేష్ న‌మ‌త్రను పెళ్లి చేసుకున్నాడా..!

సినిమా ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు సొంతం చేసుకోవడంతో పాటు 18 సంవత్సరాల పాటు ఎలాంటి వివాదాల్లో నిలవకుండా అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగించిన జోడీలలో మహేష్ – నమ్రత జోడీ ఒకటి. వంశీ సినిమాలో మహేష్ నమ్రత కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినా మహేష్, నమ్రత మధ్య ప్రేమ పుట్టింది. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన మహేష్ నమ్రత అతి కష్టం మీద పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

We have eyes only for each other: Namrata Shirodkar

ఎంతోమంది అందగత్తెలు ఉన్నా మహేష్ నమ్రతను ప్రేమించడానికి అసలు కారణం ఏంటనే ? ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. అయితే మహేష్ తో పోలిస్తే నమ్రత వయస్సులో పెద్ద అయినా ఆమె బిహేవియర్ నచ్చడంతో పాటు ఇద్దరి ఇష్టాయిష్టాలు మ్యాచ్ కావడంతో మహేష్ నమ్రతను ప్రేమించారని తెలుస్తోంది. మహేష్ పెట్టిన షరతులకు సైతం నమ్రత వెంటనే అంగీకరించింద‌ట‌.

పెళ్లి తర్వాత మహేష్‌కు నమ్రత సినిమాలలో నటించడం ఇష్టం లేకపోవడంతో నటన అంటే ఇష్టం ఉన్నా నమ్రత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మహేష్ – నమ్రత పెళ్లి అప్పట్లో చాలా సింపుల్ గా జరిగింది. కట్నం తీసుకోకుండానే మహేష్ నమ్రతను పెళ్లి చేసుకున్నాడని సమాచారం. మరోవైపు మహేష్ వరుస సక్సెస్ ల వెనుక నమ్రత ఉన్నారని చాలామంది భావిస్తారు.

How Mahesh Babu and Namrata Shirodkar fell in love - Rediff.com

క్రేజీ డైరెక్టర్లతో మహేష్ నటించేలా చేయడంతో పాటు.. మహేష్ పారితోషికం సినిమా సినిమాకు పెరిగేలా నమ్రత జాగ్రత్త పడతారని తెలుస్తోంది. మహేష్ లా నమ్రతకు కూడా సేవాభావం ఎక్కువని ఈ లక్షణమే నమ్రతను మహేష్ కు దగ్గర చేసిందని మహేష్ సన్నిహితులు భావిస్తారు. ప్రస్తుతం 70 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ రాజమౌళి సినిమా నుంచి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడు.

రాజమౌళి సినిమా తర్వాత కూడా మహేష్ తనతో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా డైరెక్టర్లను క్యూలో పెట్టారని తెలుస్తోంది. ఈ దర్శకులు సైతం మహేష్‌తో పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. రాజమౌళి సినిమా షూట్ మొదలయ్యాక మహేష్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.