గుంటూరు కారం పెద్ద గంద‌ర‌గోళం… త్రివిక్ర‌మ్‌పై మ‌హేష్ కారాలు మిరియాలు..!

ఏ ముహూర్తానా మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ మొద‌లు పెట్టారో కాని ఓ ప‌ట్టాన ముందుకు క‌ద‌ల‌డం లేదు. మ‌హేష్ ఇంట్లో రెండుమూడు బ్యాడ్ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈలోగా విదేశాల‌కు వెళ్లి వ‌చ్చాడు. అక్క‌డే చాలా లేట్ అయ్యింది. మ‌హేష్ ఖాళీ అయ్యాడ‌నుకుంటే ఇటు త్రివిక్ర‌మ్‌కు ఆయ‌న ప‌నులు ఆయ‌న‌కు ఉన్నాయి. అస‌లు త్రివిక్ర‌మ్‌కు ఈ సినిమా కంటే ప‌వ‌న్ సినిమాల మీదే ఎక్కువ ధ్యాస ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

Mahesh Babu Guntur Kaaram : Latest Update on Mahesh Trivikram Movie Guntur  Kaaram

ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ప్ర‌కాష్‌రాజ్ అతిక‌ష్టం మీద ఈ నెల 20 నుంచి డేట్లు ఇచ్చాడ‌ట‌. ముందు ప్ర‌కాష్ సీన్లు తీయాలి. ఓ ఇంట్లో ఈ సీన్లు షూట్ చేయాలి. ఇప్ప‌టికిప్పుడు ఇంటి సెట్ వేయ‌లేరు. దీంతో ఓ మాంచి ఇంటి కోసం వెతుకుతున్నార‌ట‌. అస‌లు ముందు పాట షూట్ చేయాలా ? ఫైటింగ్ సీన్ తీయాలా ? ప్ర‌కాష్ రాజ్ మీద సీన్లు తీయాలా ? అన్న‌ది అయితే క్లారిటీ లేకుండా గంద‌ర‌గోళంగా షూటింగ్ న‌డుస్తోంద‌ని టాక్ ?

Guntur Karam and Bro : Trivikram's experiments with movie titles -  TrackTollywood

ఇప్ప‌టి వ‌ర‌కు షాపింగ్ మాల్లో తీసిన ఫుటేజ్ పై కూడా మ‌హేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడ‌ని… త్రివిక్ర‌మ్‌పై అస‌హ‌నం వెళ్ల‌గ‌క్కాడ‌న్న గుస‌గుస‌లు కూడా వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్ ఎప్పుడూ ఇంత లేజీనెస్‌గా, నిర్ల‌క్ష్యంగా సినిమాలు తీయ‌లేద‌ని.. ఇంత ఓవ‌ర్ కాన్పిడెన్స్‌కు పోలేద‌ని… ఒక్క అజ్ఞాత‌వాసి విష‌యంలోనే ఇది జ‌రిగింద‌ని.. ఆ సినిమా రిజ‌ల్ట్ ఏమైందో చూశాం అని ఇండ‌స్ట్రీ జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Trivikram Srinivas eyeing for another ex-actress for Mahesh Babu's film

మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ నుంచి అలాంటి కంప్లైంట్లు ఇప్పుడు ఈ సినిమా నుంచే వింటున్నాం అని ఇండ‌స్ట్రీ ఒక్క‌టే టాక్ ? ఇంకా కంటిన్యూగా మూడు నెల‌ల పాటు షూటింగ్ చేసినా కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యే ప‌రిస్థితులు లేవ‌ట‌. మ‌రోవైపు ఈ సినిమా త్వ‌ర‌గా పూర్తి చేసి .. రాజ‌మౌళి సినిమా మీద‌కు వెళ్లిపోవాల‌ని మ‌హేష్ తొంద‌ర ప‌డుతున్నాడు. త్రివిక్ర‌మ్ మాత్రం ఇంకా లేట్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇలా అనేక కార‌ణాల‌తో మ‌హేష్ – త్రివిక్ర‌మ్ మ‌ధ్య గ్యాప్ కూడా పెరుగుతోంద‌ని భోగ‌ట్టా…?