రికార్డు స్థాయిలో “లైగర్ ” బిజినెస్ క్లోజ్ !

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే.ఇటీవ‌ల వ‌చ్చిన టీజ‌ర్, సినిమాకు కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ క్రేజ్ తెచ్చాయి. లైగర్ హిందీ వెర్షన్ కు సంబంధించిన డీల్ చాలా ముందుగానే క్లోజ్ అయింది. తెలుగు డీల్ ను వరంగల్ శ్రీను క్లోజ్ చేసి రేటు ఫిక్స్ చేశారు.

సౌత్ ఇండియాలోని అన్ని ఏరియాల్లోని అన్ని భాషల హక్కులను 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ రికవరీ అడ్వాన్స్‌గా వరంగల్ శ్రీను నుంచి రూ.10 కోట్లు అడుగుతున్నట్లు వినిపిస్తోంది.అంతేకాకుండా,మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని 30 కోట్లకి వరంగల్ శ్రీను క్లోజ్ చేయబోతున్నారు

వైజాగ్ ఏరియాను కొరటాల స్నేహితుడు సుధాకర్ 7.5 కోట్లకు తీసుకున్నాడు. తూర్పుగోదావరి హక్కులను భరత్ చౌదరి చేజిక్కించుకోగా మిగిలిన ఏరియాలు చర్చల్లో ఉన్నాయి.

Tags: ananya pandey, director puri jagannath, liger movie business, Vijay Devarakonda