టాలీవుడ్ టాప్ హీరోల గురించి తప్పుడు వార్తలతో మైండ్ గేమ్?

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీల గురించి రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డానికి ముందుకు వచ్చారు అని కొన్ని కొత్త వార్త‌లు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.అయితే ఈ ఫీలర్స్ వెనుక కుట్ర దాగి ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ టాప్ 6 హీరోలకు ఈ పారితోషికం తగ్గించారు అని వార్తలు వస్తున్నాయి.అగ్ర హీరోలను ఆదర్శంగా చూపి వేతనాలు పెంచాలని ఇంతకు ముందు సినిమా కార్మికులు కూడా తమ జీతాలు పెంచాలంటూ ఆందోళనకు దిగారు.

సినీ కార్మికుల నోరు మూయించేందుకు, తమ లక్ష్యం నెరవేరుతుందని చూపించేందుకు నిర్మాతల గిల్డ్ సభ్యులు ఈ ఫీలర్స్ ను వదిలారని ఓ కౌన్సిల్ సభ్యుడు తెలిపారు.మరోవైపు అలాంటిదేదైనా ఉంటే హీరోలు ముందుగా గిల్డ్‌లో నిర్ధారించుకుంటారని మరో గిల్డ్ సభ్యుడు స్వయంగా చెప్పారు.కాబట్టి ఈ వార్తల్లోని హీరోలు ముందుకు వచ్చి గిల్డ్‌లో అదే వ్యక్తపరచాలని అందరు ఆశిస్తున్నారు.నిజానికి ఏ హీరో అయినా నిర్మాతకు తమ సహాయ హస్తం అందిస్తానని చెప్పడానికి ముందుకు వస్తారు. కానీ అసలు సీన్ వేరుగా ఉంది. వారు ప్రతి నిర్మాతతో విడివిడిగా వ్యవహరించటమే కాకుండా వారికి కావలసిన విషయాన్ని వారి రికార్డులోఉంచుతారు .

మరోవైపు ఈరోజు కాస్ట్ కటింగ్ కమిటీ సమావేశం జరిగింది. స్టార్స్‌కి సింగిల్ డోర్ క్యారవాన్‌లను అందించకూడదని, నిర్మాత ఏది ఏర్పాటు చేసినా అంగీకరించాలని అందులో ఒక అంశం.ఇంకో పాయింట్ ఏంటంటే.. పికప్‌ల కోసం ఇళ్లకు వాహనాలను పంపకూడదని, ప్రతి యాక్టర్‌ తమ సొంత వాహనాల్లోనే షూటింగ్‌ స్పాట్‌లకు రావాల్సిందే.అనేది రెండో అంశం .తదుపరి సమావేశం గురువారం జరగనుంది, ఖర్చు తగ్గింపు పద్ధతులపై చర్చిస్తారు .

Tags: allu arjun, jr ntr, ram charan, tollywood heros remunarations