పూరి మార్క్ లో “లైగర్” లేటెస్ట్ “వాట్ లాగా దేంగే” సాంగ్ !

విజయ్ దేవరకొండ లైగర్ (సాలా క్రాస్‌బ్రీడ్)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.

ఈరోజు ఈ చిత్రంలోని థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘వాట్ లగా డెంగే’ పేరుతో, ఈ పాట లైగర్ ఆటిట్యూడ్ ఏమిటో చూపించారు .పాటలో నత్తి సమస్యను బాగా ఉపయోగించారు మేకర్స్. సంగీతపరంగానూ, విజువల్‌గానూ ఈ పాట ఆసక్తికరంగా కనిపిస్తోంది.

బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో రమ్యకృష్ణ, గెటప్ శ్రీను, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ బహుభాషా చిత్రం ఆగస్టు 25, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags: director puri jagannnath, liger movie, liger waat laga denge song, Vijay Devarakonda